NGKL: పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ పాడి రైతులు కల్వకుర్తిలోని మహబూబ్నగర్ చౌరస్తాలో శనివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పాడి రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కిషోర్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.