కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించారు. కాంతారా చిత్రంపై అపారమైన ప్రేమను చూపించి మద్దతు తెలిపినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్ట్ 1 గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
‘KANTARA’ PREQUEL ANNOUNCED… #Kantara – one of the most successful films ever – will now have a prequel… Producers #HombaleFilms announced a prequel during its 100-day celebrations… More details of the #RishabShetty directorial to be announced in due course. pic.twitter.com/ei6xbHVgYf
కాంతారా బ్యాక్‌స్టోరీని తెరకెక్కిస్తున్నప్పుడు ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయని హోంబలే మేకర్స్ అన్నారు. కాంతారా కంటే ఇది ఇంకా గ్రాండ్‌గా ఉండబోతోందని స్పష్టం చేశారు. రూ.16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాంతారా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో అనేక భాషల్లో కలిపి దాదాపు రూ.450 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సెప్టెంబర్ 30, 2022న విడుదలైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి..తానే హీరోగా నటించగా, హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది.