KNR: బొమ్మకల్లో అక్రమ ఇంటి అనుమతులపై డీఎల్పీవో శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. రజ్వీచమన్లో పంచాయతీ అధికారులు అక్రమంగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీవో గ్రామపంచాయతీ కార్యాలయంలో అక్రమ ఇంటి అనుమతులపై వ్యవహారం పై విచారణ చేసారు.