గూడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఉదాంతం గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకాలమే రేగింది. అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసారు అంటూ ఈరోజు ఉదయం నుంచి న్యూస్ అయింది. కళాశాల హాస్టల్స్ లో నిన్న రాత్రి నుండి ఈ విషయంపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు కళాశాల నిర్వహణ సిబ్బంది సమక్షంలో పోలీసులు ఎలక్ట్రానిక్ పరికరాలను కనుగొనే డివైస్ తో తనిఖీలు చేపట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘటనపై స్పందించారు. ఆయన దీన్ని గమనించి, సమగ్ర పోలీసు విచారణను ఆదేశించారు. ఆ తరువాత విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యం మధ్య పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. పోలీసుల తనిఖీలలో ఎటువంటి ఎలక్ట్రానిక్ కెమెరా పరికరాలను కనుగొనలేదు. అందువల్ల, ప్రస్తుతం విద్యార్థులకు సోమవారం సెలవులు ప్రకటించారు. అప్పటిలోగా పోలీసులు మరొకసారి హాస్టల్స్ ని తనిఖీ చేయనున్నారు
మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యార్థుల ఆందోళనపై స్పందించారు. ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబడవు అని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి ఏవైనా నివేదికలు అందిస్తే, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రివర్యులు తెలిపారు.