గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. యావత్ తెలుగు రాష్ట్రాలను ఈ ఘటన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ కాలేజీ లో చదువుతున్న ఒక జంట హోటల్ రూమ్ కి వెళ్లి గడిపిన క్షణాలను ఆ అబ్బాయి తన మిత్రులకు షేర్ చేసాడు. ఆ వీడియోను చూపించిన ఆ అబ్బాయి మిత్రులు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు.
బయటకు రాకుండా ఉండాలంటే వారు చెప్పినట్టు చేయాలనీ అమ్మాయిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకోసం వారు ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ కెమెరా ఇచ్చి బాత్ రూంలో అమర్చామన్నారు. ఆ అమ్మాయి వారు చెప్పినట్టు చేసి సుమారుగా 300 మంది అమ్మాయిల వీడియోలు ఆ అబ్బాయిలకు ఇచ్చింది. ఈ వీడియోలతో వారు ఆ అమ్మాయిలను కూడా బ్లాక్ మెయిల్ చేయడం సార్ట్ చేశారు.
ఈ విషయాన్ని బహిర్గతం చేసిన అమ్మాయి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో, ఈ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియా వేదికల మీద కూడా పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను విచారిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు పోలీసుల అదుపులో ఉన్నారు
ఈ ఘటనపై కాలేజీ విద్యార్థులు సైతం ధర్నాలు చేస్తూ తీవ్రంగా ఖండిస్తూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అనేకమంది విద్యార్థి సంఘాలు సైతం విద్యార్థులకు మద్దత్తు తెలిపే అవకాశం ఉంది