టాలీవుడ్ మాత్రమే కాకుండా, ఇండియాలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీస్ ఎదురు చూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు – రాజమౌళి ఒకటి. ఇప్పటివరకు రాజమౌళి గురించి మన తెలుగు ప్రేక్షకులతో పాటు టోటల్ ఇండియా కి మాత్రమే తెలుసు. మహేష్ బాబుతో చేసే సినిమా (SSMB 29) ఒక ఫారెన్ ప్రొడక్షన్ హౌస్ తో కాలాబొరేట అయ్యి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటుందని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది
ఇంటర్నేషనల్ అంటే సినిమా మేకింగ్ కూడా అలానే ఉండాలి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ శరవేగంగా సాగుతుంది. సాంకేతిక నిపుణులతో రాజమౌళి ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. తాజాగా సినిమాకి సంబందించిన లొకేషన్స్ స్కౌటింగ్ కూడా జరుగుతుందని సినీ వర్గాల సమాచారం. ఒక ఫారెన్ ప్రొడక్షన్ టీంకు ఈ బాధ్యతను అప్పగించారని టాక్.
ఈ సినిమా కోసం ఇప్పటివరకూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని ఎక్సోటిక్ లొకేషన్స్ ను ఫైనల్ చేయబోతున్నారని, సినిమా విజువల్ గా చాలా రిచ్ అండ్ లావిష్ గా ఉండబోతుందని అంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాల కోసం జర్మనీ లో లొకేషన్స్ ఫైనల్ చేసినట్టు సమాచారం
ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది ఎదో ఒక అప్డేట్ ఇస్తుంటాడు హీరో మహేష్. అయితే ఈసారి అలంటి సినిమా ఉపాదాట్లు ఏమీ ఉండవని సమాచారం. మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభంకు సంబంధించి ఏ న్యూస్ ఇప్పటివరుకు బయటకు రాలేదు