»Geoffrey Boycott Cricket Legend Geoffrey Boycotts Condition Is Critical
Geoffrey Boycott: క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ పరిస్థితి విషమం
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్టు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులెందరో బాయ్‌కాట్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
Geoffrey Boycott: Cricket legend Geoffrey Boycott's condition is critical
Geoffrey Boycott: బాయ్‌కాట్ 2002లో తొలిసారి క్యాన్సర్ బారినపడ్డారు. కీమో థెరపీ అనంతరం కోలుకున్నారు. అయితే, ఈ ఏడాది మేలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకున్నారు. తాజాగా, ఆయన ఆరోగ్యం మరోమారు విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని బాయ్‌కాట్ కుమార్తె సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. తన తండ్రి కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మద్దతు ఇస్తున్న అశేష అభిమానులను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉందన్న ఆమె.. దురదృష్టవశాత్తు తన తండ్రి ఆరోగ్యం కొంత విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని, ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని ఆమె తెలిపారు.
ఇంగ్లండ్ తరపున టెస్టులు ఆడిన బాయ్ కాట్ ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగారు. 1964లో ఇంగ్లండ్ తరపున క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బాయ్‌కాట్ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా జట్టుపై ఆడాడు. టెస్టు జట్టుతో పాతుకుపోయాడు. బెస్ట్ ఓపెనర్‌గా పాపులర్ అయ్యాడు. 108 టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత 1982లో ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మొత్తంగా తన కెరీర్లో 8000 పరుగులు చేశాడు.
ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక…కొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. తన కామెంటరీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. టీవీలలో కామెంటరీ మొదలు కాకముందు వరకు రేడియో కామెంటరీపైనే క్రికెట్ అభిమానులు ఆధారపడేవారు. అటువంటి వారికి జెఫ్రీబాయ్కాట్ పేరు సుపరిచితం. టీవీలు వచ్చిన తర్వాత కూడా బాయ్‌కాట్ తన హవా కొనసాగించాడు. ఎన్నో మ్యాచులకు తన కామెంటరీతో మేలు చేశారు. బాయ్‌కాట్ కామెంటరీకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్నారు. కామెంటరీ చేస్తున్న సమయంలో ఎందరో క్రికెటర్ల లోపాలను ఎత్తి చూపేవాడు. ఎటువంటి మొహమాటాలకు పోకుండా తీవ్రంగా విమర్శించారు. తాను కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు.