»Horoscope Today Todays Horoscope 2024 July 17th Should Ensure That Expenses Do Not Increase
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 17th).. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి
ఈ రోజు(2024 July 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
Horoscope Today: Today's horoscope (2024 July 17th).. should ensure that expenses do not increase
మేషం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. దుర్గారాధన శుభప్రదం. వృషభం
మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణం విషయంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. మిథునం
మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
కర్కాటకం
కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం. సింహం
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు విషయాలపైకి మళ్లకుండా జాగ్రత్తపడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కన్య
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది.పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది. వృశ్చికం
మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి. ధనుస్సు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.
మకరం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది. కుంభం
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మీనం
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమ చేయాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.