మార్చి లో 2023 లో జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొసం ముంబై ఇండియన్స్ జట్టు కోచ్‌లను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను, బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామిని, బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఆల్ రౌండర్ దెవీకా పల్షికార్‌ను జట్టు ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని జట్టు అధికారికంగా వెల్లడించింది. ఝులన్ గోస్వామి రెండు దశాబ్దాలపాటు జట్టుకు సేవలందించారు. మహళా వన్డే క్రికెట్లో 350కిపైగా వికెట్లు తీసుకుని, అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచారు.
ఆమెకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మ శ్రీ అవార్డును కూడా అందజేసింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ కూడా ఇంగ్లండ్ జట్టుకు రెండు దశాబ్దాలపాటు క్రీడాకారిణిగా సేవలందించింది. రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా వ్యవహరించింది. లెగ్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవికా గతంలో భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కలిగిన ఆటగాళ్లను జట్టు ఎంపిక చేసుకుంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును సొంతం చేసుకున్న యాజమాన్యమే ఇప్పుడు మహిళా టీమ్‌ను కూడా దక్కించుకుంది. తాజా వేలంలో రూ.912.99 కోట్లతో ఈ జట్టును కొనుగోలు చేసింది.