Tihar Jail Officers: Tihar Jail officials have strongly denied the allegations made on Kejriwal's health
Tihar Jail Officers: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తిహార్ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. ఆప్ నేతలు జైలు పరిపాలనా విలువలను దెబ్బ తీయడానికి ఇలాంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ 8.8 కిలోల బరువు తగ్గారని, చక్కెర స్థాయిలు ఐదుసార్లు 50 కంటే తక్కువకు పడిపోయాయని, జైల్లోనే అతనిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తిహార్ జైలు అధికారులు స్పందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఏప్రిల్ 1న అతనిని జైలుకు తీసుకొచ్చినప్పుడు ఆయన బరువు 65 కిలోలు అని, ఎన్నికల నేపథ్యంలో సుప్రీం బెయిల్ మంజూరు చేసే సమయానికి 65 కిలోలకు పెరిగారని తెలిపారు. అతను జైల్లో లొంగిపోయిన సమయంలో ఆయన బరువు 63.5 కిలోలు ఉండగా.. ప్రస్తుతం అతని బరువు 61.5 కిలోలు ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల కేజ్రీవాల్ బరువు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. మెడికల్ బోర్డు సలహా బట్టి ఆహారం, చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు మండిపడ్డారు.