»Do You Have More Sim Cards In Your Name If Rs 2 Lakh Fine Or Imprisonment
Multiple SIMcards: మీ పేరుమీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా?.. ఉంటే రూ. 2 లక్షల జరిమానా లేదా జైలు శిక్ష?
ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో మంచి, చెడు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏఏ పనులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. అందుకే ఒక వ్యక్తి ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉండరాదు అని ప్రభుత్వం నియంత్రించింది. దీని గురించి అవగాహన పెంచుకోవాలి లేదంటే జైలు శిక్ష తప్పదు.
Do you have more sim cards in your name?.. If Rs. 2 lakh fine or imprisonment?
Multiple SIMcards: డిజిటల్ ప్రపంచంలో అన్ని క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. మంచి, చెడు రెండు డిజటల్ ప్రక్రియద్వారా జరిగిపోతున్నాయి. అందుకే ప్రభుత్వం అన్నింటికి కొన్ని పరిమితులు పెట్టింది. ముఖ్యంగా సిమ్ కార్డు విషయంలో గవర్నమెంట్ ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం నిర్దేశించిన సిమ్ల కన్న ఎక్కువ తీసుకుంటే పెద్ద మొత్తంలో ఫైన్, జైలు శిక్ష కూడా విధిస్తుంది. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్‌లు పొందవచ్చు. అంతకు మించి సిమ్‌లు కలిగిఉంటే అది చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వాసులకు ఆ సిమ్ కార్డుల పరిమితిని తగ్గించారు. ముఖ్యంగా జమ్మూకశ్మిర్, అస్సా, ఈశాన్య లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలో సిమ్ కార్డులు 6 మాత్రమే కలిగి ఉండాలి. ఆ ప్రాంతాల్లో నేరపూరితమైన, మోసపూరితమైన సంఘటలను, చర్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెలికమ్యూనికేషన్ చట్టం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వాలు సూచించిన వాటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉంటే మొదటి నేరానికి రూ. 50 వేల జరిమాన విధించవచ్చు. అలాగే ఉల్లంఘనకు పాలుపడితే జరిమాన రూ. 2 లక్షల వరకు పెరుగుతుంది.
అలా సిమ్‌కార్డులు పెంచుకుంటూ పోతే ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి. మూడు ఏళ్లు జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమాన కూడా విధించవచ్చని చట్టం చెబుతుంది. మరీ వీటి నుంచి తప్పించుకోవాలంటే మన పేరుమీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. దాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సాయంతో మన పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయో తెలుసుకోవచ్చు. దీన్ని తెలుసుకోవడానికి DoT ఒక పోర్టల్, సంచార్ సతిని అనే సైట్‌ను రూపొందించింది.
www.sancharsathi.gov.in. ఈ వెబ్ సైట్‌ను ఉపమోగించి సిమ్ కార్డులు చెక్ చేసుకోవచ్చు.