»Tiny Dead Snake Found In Mid Day Meal In Maharashtra Congress Leader Demands Probe
Mid-Day Meal : మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము!
మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో విద్యార్థికి మిడ్ డే మీల్ ప్యాకెట్‌ని ఇచ్చారు. దాన్ని తెరిచి చూడగా అందులో చనిపోయిన పాము కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Tiny dead snake found in mid-day meal : ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్నం భోజన పథకాలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోనూ ఇలాగే ఈ పథకం అమలవుతోంది. అక్కడ రోజూ విద్యార్థులకు అంగన్వాడీ కార్యకర్త మిడ్డే మీల్( mid-day meal) ప్యాకెట్‌ని అందజేస్తూ ఉంటారు. అలాగే గత సోమవారం మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా పలుస్లోనూ మధ్యహ్న భోజన పథకం ప్యాకెట్లను అందించారు. అది ప్రభుత్వం నడుపుతున్న నర్సరీ స్కూల్. ఆరు నెలల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ఉన్న వారు మాత్రమే అక్కడ ఉంటారు.
మధ్నాహ్నం ఆ ప్యాకెట్ తీసుకున్న చిన్నారి ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఆ ప్యాకెట్ తెరచి చూడగా అందులో చనిపోయిన చిన్న పాము(Tiny dead snake) కనిపించింది. దీంతో వారు అవాక్కయ్యారు. దీంతో బుధవారం వారు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత సంగ్లి జిల్లా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చారు. అంగన్వాడీలో ఉన్న సరుకుల్ని టెస్టింగ్‌కి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ కదమ్ ఈ అంశంపై స్పందించారు. ఈ విషయమై పక్కాగా విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.