»Vishwambara Vishwambara Super Update That Routine Again
Vishwambara: ‘విశ్వంభర’ సూపర్ అప్డేట్.. మళ్లీ ఆ ఆనవాయితీ!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా సూపర్ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. అలాగే.. ఈ సినిమాతో మరుగున పడిన ఆనవాయితీని మళ్లీ తీసుకొస్తామని అన్నారు మెగాస్టార్.
Vishwambara: 'Vishwambara' super update.. that routine again!
Vishwambara: బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వశిష్ట. దీంతో రెండో సినిమాతోనే మెగాస్టార్‌తో ఛాన్స్ అందుకున్నాడు. వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ఇదే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా ఏళ్లకు త్రిష ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రి ఇస్తుండగా.. ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ బ్యూటీస్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. విశ్వంభరలో విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నాడు.
ఈ రోజే జన్మించిన మా 'ఆస్కారుడు' ఎం.ఎం. కీరవాణి గారికి నా హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు ! 💐💐
మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు జూలై 4న కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా.. ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా మెగాస్టార్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ.. కీరవాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోల.. ఒకప్పుడు అందరూ ఒక చోట చేరి సంగీత దర్శకులు ఊహల్లో నుంచి పయనిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకుని ఆమోదముద్ర వేశాకే.. ఆ పాట బయటికి వచ్చేది.
మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ.. మళ్ళీ మాకు కీరవాణి గారు విశ్వంభర కోసం పాటలు కంపోజ్ చేసే ప్రక్రియను మా ఇంట్లో ఏర్పాటు చేశారు. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తొచ్చాయని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. విశ్వంభరకు సంబంధించిన డబ్బింగ్ పూజా కార్యక్రమాలతో ఆరంభిస్తున్నట్టుగా తెలిపారు. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 10న విశ్వంభర రిలీజ్ కానుంది.