»Lancet Study Half Of Indians Do No Physical Activity
Lancet study: సగం మంది భారతీయులు శారీరక శ్రమ చేయట్లేదు
ప్రస్తుతం చాలామంది కొత్త జీవనశైలికి అలవాటు శారీరమ శ్రమకు దూరం అవుతున్నారు. శరీరానికి తగ్గ శ్రమను అందించడం లేదని ‘ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ అధ్యయనం వెల్లడించింది.
Lancet study: Half of Indians do no physical activity
Lancet study: ప్రస్తుతం చాలామంది కొత్త జీవనశైలికి అలవాటు శారీరమ శ్రమకు దూరం అవుతున్నారు. శరీరానికి తగ్గ శ్రమను అందించడం లేదని ‘ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ అధ్యయనం వెల్లడించింది. ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. దాదాపు 57 శాతం మంది మహిళలు శారీరక శ్రమకు దూరంగా ఉండగా.. పురుషుల్లో 42 శాతం మంది ఉన్నారు. శరీరానికి తగ్గట్లు చేయాల్సిన స్థాయిలో శారీరక శ్రమ చేయకపోవడం వల్ల జబ్బుల ముప్పు కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ‘ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31 శాతం మంది వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ, కఠిన వ్యాయామాలు లేదా 75 నిమిషాల కఠిన లేదా అతి కఠిన వ్యాయామాలైనా చేయడం లేదు. ఇలా సరిపడినంత వ్యాయామం చేయనివారు 2010లో 26.4 శాతం ఉండగా ఇప్పుడు అది 31 శాతానికి చేరుకుంది. ఇలా చూసుకుంటే 2030 నాటికి కనీస శారీరక శ్రమ చేయని వారి సంఖ్య 60 శాతానికి చేరిపోతుందట. ఇలా వ్యాయామం చేయని వారిలో మధుమేహం, గుండెపోటు వంటి ముప్పులు ఇంకా ఎక్కువ అవుతాయని తెలిపింది. రోజురోజుకి జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని అధ్యయనం తెలిపింది.