»Ram Charan Vs Allu Arjun %e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d %e0%b0%9a%e0%b0%b0%e0%b0%a3%e0%b1%8d Vs %e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81 %e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%81
Ram Charan vs Allu Arjun: రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. నిజమైతే ఫ్యాన్స్ కొట్టుకుంటారు?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బిగ్ ఫైట్ తప్పదా? అంటే, తప్పదనే టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే.. అల్లు, మెగాభిమానులను ఆపడం ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి. మరి ఇది నిజమేనా? మేకర్స్ రిస్క్ తీసుకుంటారా?
Ram Charan vs Allu Arjun.. If true, fans will beat?
Ram Charan vs Allu Arjun: ఇప్పటి వరకు చరణ్, బన్నీ సినిమాల పరంగా పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ ఈసారి పరిస్థితులు మాత్రం ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర నువ్వా? నేనా? అనడానికి సై అనేలానే ఉన్నాయి. ఏపి ఎన్నికల విషయంలో సోషల్ మీడియా వేదికగా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ ఎలా జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున్న రామ్ చరణ్, పవన్‌కు సపోర్ట్‌గా పిఠాపురం వెళితే.. బన్నీ మాత్రం వైసీపి అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లాడు. ఆ సమయంలో స్వయంగా నాగబాబు.. మా వాడైన పరాయి వాడే.. అని ఓ ట్వీట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దానికి తోడు పవన్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక్కడి నుంచి ఓ వర్గం మెగా ఫ్యాన్స్ బన్నీని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ నెగెటివిటీ కారణంగానే బన్నీ తన పుష్ప2 సినిమాను వాయిదా వేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కానీ పుష్ప2 షూటింగ్ డిలే కారణంగా ఆగష్టు 15 నుంచి దాదాపుగా పోస్ట్ పోన్ అయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు ఏమైనా.. పుష్ప2 మాత్రం క్రిస్మస్ కారణంగా డిసెంబర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కానీ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే రానున్నట్టుగా ముందు నుంచి ఓ మాట వినిపిస్తోంది. ఇప్పుడు దిల్ రాజు డిసెంబర్‌కే మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర జరగబోయే రచ్చ, థియేటర్లు తగలబడిపోయేలా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఖచ్చితంగా ఆఫ్‌లైన్‌లో కొట్టుకుని తీరుతారు. అంతేకాదు.. ఇక్కడి నుంచి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం మరింత ముదురడం గ్యారెంటీ. కానీ.. పుష్ప2, గేమ్ చేంజర్ మధ్య పోటీ అంటే, మేకర్స్ అంత రిస్క్ తీసుకునే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి.. ప్రస్తుతానికి ఇలాంటి వాటిని పుకార్లుగానే చూడొచ్చు.