తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య చెలరేగిన గాలి దుమారం మామూలుది కాదు. కొందరు జానీ మాస్టర్ మీద సదభిప్రాయంతో శ్రష్టి ఊసెత్తకుండా ఉండమని హెచ్చరించినట్టుగానే మందిలిస్తూ హితవు చెప్పారు. దానికి జానీ మాస్టర్ అతని భార్య కూడా నీతివాక్యాలు చెబుతూ, తామెంత శ్రష్టికి సాయపడ్డామో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు.
ఈ మధ్య రోజుల్లో బాగా వార్తల్లోకి ఎక్కిన పేరు శ్రష్టి వర్మ. ఎవరీ శ్రష్టి వర్మ అని ఎవరూ అడగనంత పాప్యులర్ అయి కూర్చుంది. ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ కూడా అంతే హెడ్ లైన్స్ ని ఆక్రమించాడు. ఇద్దరూ ప్రతీ మీడియా ప్లాట్ఫార్మ్ నీ కుమ్మేశారు. ఎక్కడ చూసినా అదే గొడవ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య చెలరేగిన గాలి దుమారం మామూలుది కాదు. కొందరు జానీ మాస్టర్ మీద సదభిప్రాయంతో శ్రష్టి ఊసెత్తకుండా ఉండమని హెచ్చరించినట్టుగానే మందిలిస్తూ హితవు చెప్పారు. దానికి జానీ మాస్టర్ అతని భార్య కూడా నీతివాక్యాలు చెబుతూ, తామెంత శ్రష్టికి సాయపడ్డామో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు. విసిగెత్తిపోయిన పెద్దమనుషులు నీ ఏడుపు నువ్వు ఏడువు అని చెప్పి ఊరుకున్నారు. అదంతటితో ఆగలేదు. శ్రష్టి పరిశ్రమలో ఉన్న ప్రముఖ స్థానాలలో ఉన్న మహిళామణులను కలిసి వారి వత్తాసును తెచ్చుకుంది. దాంతో శ్రష్టి కి కనిపించని బలం వచ్చేసింది. ఈ విషయాన్ని జానీ మాస్టర్ పూర్తిగా విస్మరించాడు.
పర్యవసానంగా జానీ మాస్టర్ పూర్తి మూల్యాన్ని చెల్లించక తప్పలేదు. జానీ మాస్టర్‌గా అత్యున్నతమైన పేరుప్రతిష్టలను సంపాదించుకున్న ఆయన బతుకు బస్ స్టాండ్ అయి, కొంప కొల్లేరయిపోయింది. ఆడదానితో గొడవ వచ్చిన తర్వాత ఏ మగాడి సంజాయిషీని ఎవ్వరూ ఖాతరు చేయరు. మగాడిదే తప్పని తేల్చిపారేస్తారు. అదే జరిగింది జానీ మాస్టర్‌కి కూడా.
వీళ్ళ గొడవ ఇంకా తెల్లారలేదు. కేసు కోర్టులోనే ఉంది. కేసు విత్‌డ్రా చేసుకోమని శ్రష్టికి ఎన్నో రికమండేషన్లు వెళ్ళాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా శ్రష్టిని సముదాయించడానికి విశ్వప్రయత్నం జరిగింది. కానీ శ్రష్టి వర్మ వెనుకనున్న బలమైన మనుషులు పొమ్మని చెప్పమని శ్రష్టికి ఉపదేశాలు చెప్పడంతో కోర్టులో కేసు వాయిదాల మీద వాయిదాల పద్ధతిలో ధారావాహిక సీరియల్‌గా ముందుకు సాగుతోంది.
అయితే ఇందులో ఒక్క దారిని మాత్రం జానీ మాస్టర్‌కి శ్రష్టి వర్మ వదిలింది. అది జానీ మాస్టర్ బేషరతుగా క్షమాపణలు చెప్పడం. చెబితే తాను కోర్టులో కేసును విత్ డ్రా చేసుకుంటానని, లేదంటే కోర్టులోనే తేల్చుకుంటానని శ్రష్టితెగేసి చెప్పేసింది. శ్రష్టి ప్రస్తుతం జాలీగా తన వర్క్ తను చేసుకుంటూనే ఉంది. మొన్నీ మధ్య డైరెక్టర్ సుకుమార్ కూడా సీతా పయనం సినిమా ఈవెంట్లో శ్రష్టి వర్మ ని బాగా మెచ్చుకోవడం శ్రష్టి ప్రొఫెషనల్ లైఫ్‌కి బాగా దోహదపడేవిధంగానే ఉపకరించింది. ఎటొచ్చి జానీ మాస్టర్ లైఫే అపవాదుల మయం, అప్రతిష్టల మయంగా మారింది. జానీ మాస్టర్ మరి క్షమాపణలు చెప్తాడా లేక నెత్తిమీదన పెట్టుకుని కాలం వెళ్ళబుచ్చుతాడా అన్నది ప్రస్తుతం వెయ్యి వరహాల ప్రశ్న.