SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ”సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ఎల్ఎన్ పేట మండలం వాడవలస గ్రామంలో నిర్వహించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా బూత్ ఇంచార్జి ఉమా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వారికి కరపత్రాలను పంపిణీ చేశారు. క్లస్టర్ ఇంచార్జి అప్పన్న పాల్గొన్నారు.