సత్యసాయి: మడకశిర నగర పంచాయతీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జూలై 16న బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ జగన్నాథ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించే ఎన్నికకు కౌన్సిలర్లు తప్పకుండా హాజరుకావాలని కమిషనర్ కోరారు.