NLR: అనంతసాగరంలో ఆదివారం రాత్రి ఆంజనేయ స్వామి గుడి వద్ద అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించారు. వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం అందజేశారు. ఉదయకర్తలు అన్నదాన నిర్వహించారు.