MHBD: జిల్లా ప్రజలకు SP సుధీర్ రాంనాథ్ కెనన్ సోమవారం పలు సూచనలు చేశారు. ఇటీవల పలు ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్ళ ఘరానా మోసాలు బయటపడ్డాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు పంపమంటే పంపి మోసపోవద్దని, సైబర్ నేరస్థుల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి తెలుపాలణి కోరారు.