మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు గానీ, పుష్ప2 సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని అంటున్నారు. అయితే.. దీనికి కారణం షూటింగ్ డిలేనే అంటున్నారు గానీ, అసలు కారణం వేరే ఉందని అంటున్నారు.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఇప్పటికే పుష్ప2 నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో.. పుష్ప2 రిలీజ్ డేట్ ఆగస్టు 15 కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. రెండు మూడు యూనిట్లు గట్టిగా పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయినా కూడా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవడానికి ఇంకా 50 రోజులు పైనే పడుతుందని సమాచారం. దీంతో.. ఈ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. షూటింగ్ డిలోతో పాటు వాయిదాకు మరో కారణం కూడా చెబుతున్నారు. అల్లు అర్జున్ మీద ఇటీవల నెగెటివ్ ప్రచారం కాస్త ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మిత్రుడైన శిల్పా రవికి ప్రచారం చేయడంతో.. అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది.
దీంతో.. మెగా అభిమానుల్లో బన్నీ మీద బాగా నెగెటివిటీ పెరిగిపోయినట్టుగా తెలుస్తునే ఉంది. ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పై గట్టి ప్రభావం పడేలా ఉంది. అందుకే.. పుష్ప2ని వాయిదా వేయడమే బెటర్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఒకవేళ ఇదే నిజమైతే.. బన్నీనే దీనికి కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీ చేసిన పని వల్లే ఇంత నెగెటివిటీ వచ్చిందని అంటున్నారు. ఒకవేళ పుష్ప2 వాయిదా పడితే.. బిజినెస్ లెక్కలన్నీ కూడా తారుమారైనట్టేనని అంటున్నారు. ఇప్పటికే దాదాపుగా పుష్ప2 బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇక సినిమా థియేటర్లోకి రావడమే లేట్ అని.. థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు పోస్ట్‌పోన్ అనే టాక్ బయటికి రావడంతో.. పుష్ప 2 బిజినెస్ లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయట. వాయిదా వల్ల కలిగే నష్టాన్ని నిర్మాతలే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే.. అసలు పుష్ప2 వాయిదా పడుతుందా? లేదా అనే విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.