Sasikala : తాను తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించే సమయం(Time) వచ్చేసిందని శశికళ అన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయ లలిత నెచ్చెలి శశికళ తాను ఇక రాజకీయాల్లో యాక్టివ్గా ఉండబోతున్నట్లు తెలిపారు. అన్నా డీఎంకే మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తానని చెప్పారు. వచ్చే 2026 తమిళనాడు ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అమ్మ పాలన తిరిగి వస్తుందని ఆమె ప్రకటించారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న పళని స్వామి అధికార ప్రభుత్వాన్ని కనీసం నిలదీయలేకపోతున్నారని శశి కళ(Sasikala) అన్నారు. ఇక మీదట తానే అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నానని తెలిపారు. పార్టీపై పట్టు సాధించడానికి గతంలో ప్రయత్నించి విఫలయత్నం చేశారు శశికళ. ఓ కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఆమె ఇప్పుడు మళ్లీ తమిళనాడు యాక్టివ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఈ ప్రకటన చేశారు.
మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే మూడు, నాగులో స్థానాలకు పడిపోవడం విచారించదగ్గ విషయమని శశికళ కామెంట్ చేశారు. కొన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు సైతం దక్కలేదని అన్నారు. దీంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని చెప్పుకొచ్చారు. ముందు పార్టీని ఏక తాటిపైకి తెచ్చి తర్వాత అధికారాన్ని సొంతం చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమిళ ప్రజలు తమతో ఉన్నారని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.