Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 17th).. ఆందోళనలు ఉన్నాయి.
ఈ రోజు(2024 June 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
వ్యాపారరంగంలోని వారు విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం కుదురుతుంది. అన్ని విషయాల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. కొత్త వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వృషభం
ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు వేదిస్తాయి. వృధాప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
మిథునం
వ్యవసాయరంగంలోని వారికి లాభాలు ఉన్నాయి. కొన్ని ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. కొందరికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళనలు ఉన్నాయి.
కర్కాటకం
మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మేలు. ఆకస్మిక కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి అప్పు చేయాలని చూస్తారు.
సింహం
మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సన్నిహితులతో మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులు మీ సహాయాన్ని కోరుతారు.
కన్య
శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల
ఆకస్మిక ధననష్టం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళనలు ఉన్నాయి.
వృశ్చికం
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు ఉన్నాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కరువు అవుతుంది.
ధనుస్సు
శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కొత్త వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
మకరం
అనారోగ్య బాధలు ఉన్నాయి. అనుకోని కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయాందోళనలు ఉన్నాయి. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లక పోవడమే మేలు.
మీనం
అకాల భోజనం వలన అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ శ్రద్ద అవసరం. చెడు పనులకు దూరంగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి.