»Shocking Is Allu The Estranged Mega Nephew Of The Couple
Sai Dharam Tej: షాకింగ్.. అల్లు జంటకు దూరమైన మెగా మేనల్లుడు?
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం అల్లు అర్జున్ వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పటి నుంచి మరింత ముదిరింది. ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు అల్లు జంటకు దూరమైనట్టుగా తెలుస్తోంది.
Shocking.. Is Allu the estranged mega nephew of the couple?
Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మెగా ఫ్యామిలీ మొత్తంగా పవన్‌కు మద్దతుగా నిలిచింది. మెగా హీరోలంతా పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజున రామ్ చరణ్, అల్లు అరవింద్ కూడా వెళ్లారు. కానీ అదే రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు. అక్కడి నుంచి మెగా వర్సెస్ అల్లు వార్ మరింత ముదిరింది. పవన్ కళ్యాణ్‌కు ఆయనకు కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలని కోరుకున్నాడు అల్లు అర్జున్. కానీ తన భార్య స్నేహితురాలి భర్త తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ.. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లాడు బన్నీ. దీంతో.. ఈ అంశం మీద నాగబాబు చేసిన ట్వీట్ దుమారం లేపింది. మావాడైనా పరాయి వాడే అంటూ చేసిన ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్ చేశాడు.
కానీ మెగా అభిమానులు బన్నీ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అల్లు ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ పై కౌంటర్ ఎటాక్ చేశారు. కానీ ఫైనల్‌గా జనసేన, బిజెపి, తెలుగుదేశం కూటమీ భారీ మెజారిటీతో గెలుపొందింది. బన్నీ సపోర్ట్ చేసిన నంద్యాల అభ్యర్థి కూడా ఓడిపోయాడు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. ఇదిలా ఉండగనే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వారిద్దరిని అన్ ఫాలో చేసినట్లుగా చెబుతున్నారు. చెప్పాలంటే.. సాయి ధరమ్ తేజ్‌కు పవన్ అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరు కలిసి ‘బ్రో’ అనే సినిమాలో కూడా నటించారు. పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. పైకి ఎత్తి మరి తన ఆనందాన్ని పంచుకున్నాడు తేజ్. కానీ ఇపుడు అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది.