»The Position Of Seven Women In The Central Cabinet Who Is It
Central Cabinet: కేంద్ర కేబినెట్లో ఏడుగురు మహిళలకు స్థానం.. ఎవరెవరంటే?
రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 మంది స్వతంత్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో ఈసారి ఏడుగురు మహిళలకు మంత్రులుగా సేవ చేసే అవకాశం లభించింది.
The position of seven women in the central cabinet.. Who is it?
central cabinet: మోడీ కేబినెట్లో ఏడుగురు మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. వీరిలో ఇద్దరు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా… మిగతా వారు సహాయ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. అమేథీ నుంచి ఓటమి చవిచూసిన స్మృతి ఇరానీకి కేబినెట్లో చోటు దక్కలేదు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 మంది స్వతంత్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో ఈసారి ఏడుగురు మహిళలకు మంత్రులుగా సేవ చేసే అవకాశం లభించింది. ఆ ఏడుగురిలో ఇద్దరు కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకోగా… మిగతా వారు సహాయ మంత్రులుగా ఛాన్స్ కొట్టేశారు.
కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న నిర్మలా సీతారామన్….మరోసారి మోడీ కేబినెట్లో అవకాశం దక్కించుకున్నారు. గత ప్రభుత్వం ఆమె ఆర్ధిక మంత్రిగా సేవలందించారు. జీఎస్టీ అమలు పరచడంలోనూ, కోవిడ్ తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారు. మోడీ కొత్త కేబినెట్లో కూడా నిర్మలా సీతారామన్‌కు కీలక శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన అన్నపూర్ణాదేవికి కూడా మోడీ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. గత ప్రభుత్వంలో కూడా ఆమె విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2024లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని కోడెర్మా స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. సీపీఐఎంఎల్ పార్టీకి చెందిన వినోద్ కుమార్ సింగ్‌పై 3.77 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆమె గెలుపొందడం ఇది రెండోసారి కావడం విశేషం.
మహారాష్ట్రకు చెందిన మహిళా ఎంపీ రక్షా ఖద్సే కూడా మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఉత్తర మహారాష్ట్రలో రావెర్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్ధిపై మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్రలో సీనియర్ నాయకుడైన ఏక్నాథ్ ఖడ్సే కోడలైన రక్షా ఖడ్సే… ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. 2013లో తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దగ్గర నుంచి ఆమె …అనేక సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మోడీ కేబినెట్లో స్థానం సంపాదించారు. మహిళల ఉన్నతికి పాటు పడడం ఆమెకు ఎంతో ఇష్టం. దీనితో పాటు పిల్లల చదువు సంధ్యలు, రైతుల సమస్యలను పరిష్కరించడం కూడా ఆమెకు ఎంతో ఇష్టమైన పనులు కావడం విశేషం.
బెంగళూర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన శోభా కరంద్ …మోడీ కేబినెట్లో సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన శోభ… కన్నడ రాజకీయాల్లో రాటుదేలారు. గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో కీలక పదవులు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ, సివిల్ సప్లయ్ శాఖల్లో మంత్రిగా సేవలందించారు. 2024లోక్‌సభ ఎన్నికల్లో .. కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడపై రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్నాదళ్ పార్టీకి చెందిన అనుప్రియా పాటిల్ కూడా మోడీ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ స్థానం నుంచి ఏకంగా 4.71లక్షల ఓట్లు తేడాతో తన ప్రత్యర్ధిపై అనుప్రియ గెలిచారు. ప్రస్తుతం మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. సహాయ మంత్రిగా పనిచేయనున్నారు. అనుప్రియ పాటిల్‌కు కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగడం ఇది మూడోసారి. 2016 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా 2021 నుంచి మోడీ కేబినెట్లో వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
మధ్య ప్రదేశ్‌కి చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకుర్ కూడా మోడీ మంత్రి వర్గంలో సభ్యురాలుగా చేరారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆమె కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సావిత్రి ఠాకుర్‌ను ఆ ప్రాంత ప్రజలు ముద్దుగా దీదీ అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాధేశ్యామ్‌ను 2.18లక్షల తేడాతో ఓడించారు. సావిత్రి ఠాకుర్ గిరిజన మహిళ కావడం విశేషం. గుజరాత్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నిమూబెన్ కూడా మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా చేరారు. గుజరాత్ నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా… వారిలో నిమూబెన్ను మంత్రి పదవి వరించింది. గుజరాత్ రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉండే నిమూబెన్ … గతంలో భావ్‌నగర్ మేయర్‌గా రెండు సార్లు సేవలందించారు. 2013-21 వరకు గుజరాత్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా నిమూబెన్ పనిచేశారు. బీజేపీ పెద్దల అభిమానాన్ని చూరగొన్నారు. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.