ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రయోజనం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అతని రాక ఇప్పటికే ఆలస్యం అయినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వలె ప్రజల్లో అయిదేళ్ళు ఉండాలని చెప్పారు. జూనియర్ అయిదేళ్ళు ప్రజల్లో ఉంటేనే వచ్చేసారి అవకాశం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కు పగ్గాలు ఇచ్చి ప్రజల్లో కొన్ని ఏళ్లు ఉంటే గానీ అప్పుడు అవకాశం ఉండవచ్చునని చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలలో మళ్ళీ జగన్ గెలిచి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పారు.