ఎన్డీయే భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీలతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై సార్వత్ర ఆసక్తి నెలకొంది.
Chandrababu: రాజకీయ విశ్లేషకుల ఆసక్తి అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంది. వినుత్నరీతిలో కూటమి విజయం సాధించడం.. అంతేకాకుండా కేంద్రంలో మోడీ అధికారం చేపట్టడంలో ఏపీ రాజకీయాలు పాత్ర వహించడంతో ఆసక్తి డబుల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే మీటింగ్‌కు హాజరు అయిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరువురు ఏపీకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉండవల్లిలో తన నివాసానికి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇక వారితో చర్చించి శుక్రవారం జరగనున్న ఎన్టీఏ కీలక భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌కు ఎంపీలు కూడా హాజరుకానున్నారు.
ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన నివాసంలో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీయే కూటమి నేతగా ముచ్చటగా మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 8న ఆయన రాజ్యంగ బద్దంగా పదవి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. అంతే కాదు జనసేన ఎంపీలు సైతం మోడీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విషయంపై చర్చించడానికే చంద్రబాబు ఎంపీలతో భేటీ కానున్నారు.