NLG: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం శాలిగౌరారం మండలం భైరవునిబండలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. గ్రామాన్ని సుందరీకరణ చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.