ప్రపంచ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహం అధికారికంగా ఆమోదం. కానీ భారతదేశంలో అధికారికంగా కాదు కదా అనధికారికంగా కూడా స్వలింగ సంపర్కుల వివాహం ఆమోదం లేదు. ఓ అబ్బాయి మరో అబ్బాయిని.. అమ్మాయిలు అమ్మాయిలు ఇష్టపడడం.. వారితో ప్రేమలో మునిగివారిని స్వలింగ సంపర్కులు అంటాం. స్వలింగ సంపర్కుల వివాహాలను భారతదేశ సంప్రదాయాలు అడ్డుగా ఉన్నాయి. దేశంలో వారికి అండగా నిలిచే చట్టాలు కూడా లేవు. దీంతో ఇద్దరు యువకులు తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
భారత్ కు చెందిన ఉత్కర్శ్ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేశారు. చదువుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమబంధాన్ని వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ వివాహానికి అనుమతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు మరో ముగ్గురు తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్ లను కలిపి మార్చి నెలలో విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయమై దేశంలో కొన్నాళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. వీరి వివాహానికి ఆమోదం లభిస్తే తైవాన్ లో మాదిరిగా మనదేశంలో కూడా స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధత కానున్నాయి.