ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని ప్రధాని మోదీ ఈరోజు సందర్శించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోను నరేంద్రమోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
PM Modi: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని ప్రధాని మోదీ ఈరోజు సందర్శించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోను నరేంద్రమోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూరీ మహా ప్రభు జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నాను. పూరీ జగన్నాథుడి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉంటాయి. ప్రగతి పథంలో కొత్త శిఖరాలను మార్గనిర్దేశం చేస్తాయంటూ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మాట్లాడుతూ.. అధికార బీజేడీ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేశారు.
Prayed to Mahaprabhu Jagannath in Puri. May His blessings always remain upon us and guide us to new heights of progress. pic.twitter.com/jom9EBq9Zg
బీజేడీ పాలనలో పూరీలోని 12వ శతాబ్దపు జగన్నాథ్ ఆలయం సురక్షితం కాదన్నారు. గత ఆరేళ్లుగా రత్న భండార్ తాళాలు కనిపించడం లేదన్నారు. ఈ రత్న భండాగారం పూరీ జగన్నాథ ఆలయం కిందిభాగంలో ఉంటుంది. అప్పట్లో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నట్లు సమాచారం. అయితే వీటి విలువ వెటకట్టలేనిదని అంచనా. ఆ రత్నభండార్ తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే ఆ కీలక విభాగ తాళాలు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.