తెలంగాణలో BRS పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు(mp nama nageswara rao)కు మరోసారి గట్టి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు(money laundering case)లో దర్యాప్తు యాథావిధిగా కొనసాగించాలని ఈడీ(enforcement directorate)కి హైకోర్టు తెలిపింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు.. నామా నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. దీంతోపాటు ఎంపీకి చెందిన పలు ఆస్తులను కూడా జప్తు చేశారు.
ఈ క్రమంలో ఈడీ కేసు, ఆస్తుల అటాచ్ ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ నామా దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు(telangana high court) విచారణ జరిపి ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నామా తరఫు న్యాయవాది వాదించారు. వేధించడం కోసమే ఈడీ కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. నామా పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు ఈడీ గడువు కోరగా…ధర్మాసనం ఈ కేసును మార్చి 3కు వాయిదా వేసింది.
ఫేక్ కాంట్రాక్టులు, బిల్లులు సృష్టించి ఆరు డొల్ల కంపెనీల ద్వారా క్యాష్ లావాదేవీలు జరిపినట్లు ఈడీ గతంలో తెలిపింది. ఆ ఆరు సంస్థలు నామా నాగేశ్వర్ రావు, నామ సీతయ్య ఆధీనంలోనే ఉన్నాయని చెప్పింది. ఈ కేసు విషయంలో గత జులైలో కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 80 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది.