»Crime He Killed His Mother Wife Children And Committed Suicide
Crime: తల్లి, భార్య, పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్‌కు చెందిన పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
Crime: He killed his mother, wife, children and committed suicide
Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్‌కు చెందిన పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస అయ్యి అతను కుటుంబ సభ్యులను చంపేశాడు. వాళ్లతో రోజూ గొడవ పడేవాడు. దీంతో వాళ్లు అతనిని డి-అడిక్షన్ సెంటర్లో చేర్చడానికి ప్రయత్నించారు. అయిన దీనికి అతను సహకరించలేదు. మళ్లీ కుటుంబ సభ్యులు ప్రయత్నించి ఆ సెంటర్లో చేరుస్తామని అనురాగ్‌తో చెప్పడంతో తల్లి, భార్యతో గొడవపడ్డాడు.
వివాదం ఇంకా ఎక్కువ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అనురాగ్ తల్లిని కాల్చి చంపాడు. ఆ తర్వాత భార్య ప్రియాంకను సుత్తితో కొట్టి హత్య చేశాడు. ముగ్గురు పిల్లలను కూడా ఇంటిపై నుంచి తోసేశాడు. దీంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆతర్వాత తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.