»Rs 1 Lakh To Women Double For Men With 2 Wives Congress Leader Sparks Row Rs 1 Lakh To Women Double For Men With 2 Wives Congress Leader Sparks Row
Congress : ఇద్దరు భార్యలుంటే రూ.2లక్షలు.. కాంగ్రెస్ అభ్యర్థి బంపరాఫర్!
ఓ కాంగ్రెస్ అభ్యర్థి తాము గెలిచి అధికారంలోకి వస్తే మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని, అదే ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడంటే?
Kantilal Bhuria : ఎన్నికల వేళ దేశంలో చిత్ర విచిత్రమైన హామీల గురించి వినాల్సి వస్తోంది. తాజాగా ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓ వింత హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మహా లక్ష్మి పథకం కింద రూ. లక్ష(1 Lakh) బ్యాంకులో వేస్తామని తెలిపారు. అదే ఇద్దరు భార్యలు ఉంటేగనుక వారి కుటుంబానికి రెండు లక్షలు‘(2 Lakhs) ఇస్తామని వెల్లడించారు. ఈ డబ్బు మొత్తం నేరుగా మహిళల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రతిపక్షాల వారు మండి పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఆ నేత ఎవరో కాదు. యూపీఏ హయాంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించిన కాంతి లాల్ భురియా (Kantilal Bhuria). ఆయన మధ్యప్రదేశ్లోని రత్లాం( Ratlam) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‘మహాలక్ష్మి’ పథకం కింద ఏటా ప్రతీ మహిళ ఖాతాలోనూ లక్షరూపాయల డబ్బును జమ చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు భార్యలుంటే( 2 Wives) రెండు లక్షలంటూ వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలపై పలువురు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.