»Familys Puja With Live Black Cobra Goes Viral Netizens React With Shock
Black Cobra : పామును పళ్లెంలో కూర్చోబెట్టి రుద్రాభిషేకం!
నల్ల త్రాచును పళ్లెంలో కూర్చోబెట్టి రుద్రాభిషేకం చేసిందో కుటుంబం. ఈ వార్త ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Puja With Live Black Cobra Goes Viral: హిందూ సంప్రదాయంలో పామును పూజించే ఆచారం ఉంది. దేవాలయంలో ఉన్న నాగ ప్రతిమకు పూజలు చేయడం చూశాం. పుట్టదగ్గర కెళ్లి పాలు పోసి, నైవేద్యం పెట్టి రావడాన్నో చేశాం. అయితే ఏకంగా పామునే కూర్చోబెట్టి పూజలు చేసిన ఘటనలను మాత్రం ఇప్పటి వరకు చూడలేదు కదూ. అందుకే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త ఒకటి వైరల్‌గా మారింది.
ఓ పెద్ద పళ్లెంలో నల్ల తాచు(Black Cobra) పాము పడగ విప్పి కూర్చుని ఉంది. దాని మధ్యలో చిన్న శివ లింగం ఉంది. దాని చుట్టూ పూజారి సహా ఓ కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉన్నారు. దంపతులిద్దరి చేతా పంతులుగారు సీరియస్‌గా అభిషేకం చేయిస్తున్నారు. పాము దగ్గరున్న శివ లింగానికి పాలు, నీరు లాంటి వాటిని వారంతా అభిషేకం చేస్తున్నారు. పూజ(Puja) చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రాంలో omkar_sanatanii అనే హ్యాండిల్లో పోస్ట్ అయ్యింది. అయితే ఈ పూజ ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ వీడియో, ఫోటోలు ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు సరదా సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇతని గట్స్‌కి సెల్యూట్ చెయ్యాలని ఒకరంటే, ఇది మూర్ఖత్వం అంటూ మరొకరు కామెంట్ చేశారు.