»Chandrababu This Time The Alliance Will Win The Election
Chandrababu: ఈసారి ఎన్నికల్లో కూటమిదే గెలుపు!
ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
Chandrababu: This time the alliance will win the election!
Chandrababu: అవినీతి వైసీపీ ప్రభుత్వం ఈసారి ఇంటికెళ్తుందని.. కూటమిదే గెలుపు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారం ఉందని జగన్ విర్రవీగేవారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. కూటమి మ్యానిఫెస్టో ముందు వైసీపీ మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణ కోసం, తెలుగు భాషను కాపాడేందుకే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూడా కూటమిదని చంద్రబాబు అన్నారు.
ప్రజల భూములు పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఈసారి జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. మోదీ గ్యారంటీలు, కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ద్రోహి వైసీపీ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాలంలో 2500 కోట్లు ఖర్చుపెడితే.. జగన్ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే రూ.3 వేల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామన్నారు. అలాగే లబ్దిదారులు ఇంటి వద్దే పింఛను అందిస్తామన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తామని చంద్రబాబు అన్నారు.