NRML: సారంగపూర్ మండలం వంజర్ గ్రామంలో ఇటీవల పట్టుబడిన 30 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక, వైకుంఠాపూర్లో పట్టుబడిన 6 ట్రిప్పుల ఇసుకకు సోమవారం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు MRO సంధ్యారాణి ఓ ప్రకటనలో తెలిపారు. వైకుంఠాపూర్ ఉదయం 11 గంటలకు, వంజర్ పంచాయతీలో మధ్యాహ్నం 2 గంటలకు వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.