»Bomb Threats Confusion In Delhi Bomb Threats To Schools
Bomb Threats: ఢిల్లీలో కలకలం.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని చాలా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించారు.
Bomb Threats: Confusion in Delhi.. Bomb threats to schools
Bomb Threats: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని చాలా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా పాఠశాలలను ఖాళీ చేయించారు. అలాగే పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్‌తో పాటు నోయిడాలోని 12 పాఠశాలలకు ఈ-మెయిల్స్ వచ్చాయి. కొన్ని స్కూళ్లలో పరీక్షలు జరుగుతున్నాయి. కానీ వాటిని ఆపేసి.. విద్యార్థులను ఇంటికి పంపించారు.
తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో స్కూళ్లకు వచ్చి తీసుకెళ్లారు. పాఠశాలల ప్రాంగణాల్లో పోలీసులు బాంబ్ డిటెక్షన్ బృందంతో తనిఖీలు చేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఐపీ అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి ఈ-మెయిల్స్ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.