Asaduddin Owaisi: ముస్లింలే కండోమ్లు ఎక్కువగా వాడుతున్నారు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఎక్కువగా ముస్లింలే కండోమ్లు వాడుతున్నారని, ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని హైదరాబద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు తాను కౌంటర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Asaduddin Owaisi: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ముస్లీం జనభాపై చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంతే స్థాయిలో స్పందించారు. ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి, చొరబాటుదారులకు దేశ సంపదను పంచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ప్రసంగించిన మోడీపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. ఎక్కువగా కండోమ్లు ఉపయోగించేది ముస్లింలే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు. ప్రధాని మోడీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ముస్లిం జనభా తగ్గిందని.. నిజానికి ముస్లీంలే ఎక్కువగా కండోమ్లు వాడుతారు. ఈ విషయం చెప్పడంలో సిగ్గుపడడం లేదని అసదుద్దీన్ అన్నారు.
ముస్లింలు ఎక్కువ సంతానంతో మెజారిటీగా మారుతారని.. దేశ ప్రధాని హిందువుల్లో భయం కల్పిస్తున్నారని ఆరోపించారు. తమ మతం వేరు కావచ్చు కానీ.. తాము ఈ దేశానికి చెందిన వారమేనని స్పష్టం చేశారు. దళితులను, ముస్లీంలను ద్వేషించడమే మోడీ ఎజెండా అంటూ విమర్శించారు. రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ పలు వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని చేసిన వ్యాఖ్యలంటూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని వనరులపై ముస్లింలకే ఎక్కువ ప్రధాన్యత ఉంటుందని చెప్పినట్లు సభలో మోడీ చెప్పారు. ఈ వాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.