»Ys Sowbhagya Vivekas Wifes Open Letter To Cm Jagan
YS Sowbhagya: సీఎం జగన్కు వివేకా భార్య బహిరంగ లేఖ!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.
YS Sowbhagya: Viveka's wife's open letter to CM Jagan!
YS Sowbhagya: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారు. మీ తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో.. నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. సొంత కుటుంబంలోని వాల్లే హత్యకు కారణం కావడం, మళ్లీ వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఎంతో బాధించింది. మీ చిన్నాన్న నువ్వు సీఎం కావాలని ఎంతో తపించారు. కానీ అతనిపైనే విమర్శలు చేయడం నీకు తగునా? అని ఆమె అన్నారు.
BIG BREAKING 🔥🔥🔥🔥
సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ
సౌభాగ్యమ్మ
– 2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో….
– 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది
న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపడం కరెక్టేనా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం అని ఆమె అన్నారు. హత్యకు కారణమైన వాళ్లకు మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం కరెక్టేనా? ఇలాంటివి నీకు ఏ మాత్రం మంచిది కాదు. హత్యకు కారణమైన వాడు నామినేషన్ దాఖలు చేశాడు. చివరిసారిగా ప్రార్థిస్తున్నా. ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని కోరుకుంటున్నానని ఆమె లేఖలో తెలిపారు.