ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఇంతలో పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇదే విషయంపై నిరసన తెలిపేందుకు సచివాలయం వచ్చేందుకు కేఏ పాల్ ప్రయత్నించారు. గత నెల 31వ తేదీ (మంగళవారం) రోజున ఇంటినుంచి బయల్దేరారు. ముందస్తు సమాచారంతో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఇంటి వద్ద ఆయనను నిర్బంధించారు. పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిని కేఏ పాల్ ఎండగట్టారు. గత కొన్నిరోజుల నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఏ ఇష్యూపైనా అయినా సరే వేంటనే స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు బై పోల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి, ఓడిపోయిన సంగతి తెలిసిందే.