Viral News: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బోరు నుంచి మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసిపడ్డాయి. మలికిపురం మండలం దిండి కాసవరపు లంకలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచి నీటికోసం బోరు వెయాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి బోరు బండిని పలిపించాడు. ఇక బోరు వేసే పని మొదలైంది. అందరూ నీళ్లు వస్తాయి ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. స్థానికుడు మంచి నీటి కోసం వేసిన బోరు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు వచ్చి మంటలు ఆర్పెందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే అది భూమి లోపల ఉన్న గ్యాస్ పైపులైనుకు తాకడం వలనే ఇలా మంటలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే భూమిలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల మూలంగా ఇలా జరిగిందా లేదా గ్యాస్ పైపులైనుకు తాకడం వలన ఇది జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఆ మంటలు రోజులతరబడి ఉండిపోయాయి.