రేప్ బాధితురా అబార్షన్ చేయించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వైద్యుల రిపోర్టులు పరిగణలోకి తీసుకొని ఆ మైనర్ బాలికకు అబార్షన్ చేయాలని తీర్పు వెలువరించింది.
Supreme Court: ఓ 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయింది. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ బాధిత బాలిక అబార్షన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. సోమవారం ఆ తీర్పు వెలువరింది. బాలిక తల్లి ఈ ఫిటిషన్ ముందు బాంబే హైకోర్టులో వేసింది. విచారించిన హై కోర్టు అబార్షన్ అనుమతి నిరాకరించింది. దీంతో బాధితురాలి తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయింది. అయితే అప్పటికే అబార్షన్ చేసే సమయం దాటి పోయిందని బాంబే హైకోర్టు తిరస్కరించడంతో, దాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు బాలికకు వైద్య పరిక్షలు నిర్వహించాలని ఈ నెల 19న డాక్టర్లను ఆదేశించింది. గర్భాన్ని ఇలానే కొనసాగిస్తే బాలిక మానసిక, శారీరకపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న వైద్యుల రిపోర్టులను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం బాలిక అబార్షన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
అయితే ఇలాంటి కేసుల్లో ముందుగానే అబార్షన్ చేయించుకోవాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. రేప్‌కు గురైన బాలికి గర్భం దాల్చి 28 వారాలు అయిందని, ప్రస్తుతం ఆ 14 ఏళ్ల బాలిక ముంబైలో నివసిస్తుందని చెప్పారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 24 వారాల లోపే గర్భాన్ని అబార్షన్ చేసుకోవాలి. ఇది కేవలం రేప్‌కు గురైన వారికే కాకుండా వివాహితులు, మైనర్లె, దివ్యాంగులు ఎవరైనా సరే, ఏదైనా కారణంతో అబార్సన్ చేసుకోవాంటే ఇదే సమయంలో అని, ఆ బాధిత బాలిక సమయం దాటిపోవడంతో అది కుదరదు అని బాంబే కోర్టులో వాదించారు. కానీ బాలీక మానసిక స్థితిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు తన భవిష్యత్తు దృష్ట్యా తాజా తీర్పు ఇచ్చింది.