»Police Have Registered A Case Against Goshamahal Mla Rajasingh
MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో పోలీసు కేసు నమోదు అయింది. శ్రీరామనవమి రోజు ఎన్నికల నియమాళను ఉల్లంగించారని ఇది వరకే అఫ్జల్‌గంజ్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.
Police have registered a case against Goshamahal MLA Rajasingh
MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తెలిసిందే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అందుకే ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల కోడ్నను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు బుక్ చేశారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడం మూలంగా ఆయన ఎన్నికల నియమావళిని పట్టించుకోలేదంటూ సుల్తానుబజారు పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న మధుసుదన్ ఫిర్యాదు మేరకు అదే స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. వ్యయామశాల వద్ద రాజా సింగ్ ఎన్నికల కోడును ఖాతరు చేయకుండా, నియామవళిని ఉల్లంఘించి మాట్లాడరని కేసులో పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజు ఆయనపై అఫ్జల్‌గంజ్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ప్రతీ శ్రీరామనవమికి ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో గోషామహల్ పరిధిలో శ్రీరామనవమిని పెద్ద ఎత్తున నిర్వహించారు.