»Black Business Of Ipl Tickets Student Unions Protest At Uppal Stadium
IPL tickets: ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ఉప్పల్ స్టేడియం వద్ద నిరసన
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి స్టేడియంకు వెళ్లాలని అందరికి ఉంటుంది కానీ కొంత మందికి మాత్రమే టికెట్లు దొరకుతున్నాయి. అయితే వాటిని ఆన్లైన్లో పెట్టకుండా నేరుగా బ్లాక్లో అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఉప్పల్ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చెపట్టారు. ప్రస్తుతం వీరికి మద్దతుగా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Black business of IPL tickets.. Student unions protest at Uppal Stadium
IPL tickets: ఐపీఎల్ సీజన్ మొదలైందంటే అందరిలో ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. టీవీల్లో, మొబైల్లో చూసే చాలా మందికి ఒక్కసారైనా స్టేడియంకు వెళ్లీ మ్యాచ్ చూడాలి అని ఉంటుంది. ఆన్లైన్లో టికెట్లు కొనాలని చాలా మంది పడిగాపులు గాస్తారు. కానీ వారికి ఈ సంవత్సరం నిరాశే మిగిలింది. కొన్ని సార్లు అన్ లైన్లో టికెట్లు పెడుతారు. కొన్ని సార్లు ఆఫ్లైన్లో ఇస్తారు. అయితే కొంత మంది విద్యార్థి సంఘాలు టికెట్లు ఇవ్వడంలో ఓ పద్దతి లేదని, ఇష్టం వచ్చినట్లు బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఐపీఎల్ టికెట్లు (IPL Tickets) బ్లాక్ దందా పాల్పడుతున్నారని ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఆందోళనకు దిగారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని, బ్లాక్ దందాను అరికట్టాలని హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావును కలిసి.. వినతి పత్రం ఇవ్వాలని ఏఐవైఎఫ్, పీఎల్వై విద్యార్థి సంఘాల నాయకులు స్టేడియానికి వచ్చారు. అయితే వారిని భద్రతా సిబ్బంది లోపలికి పంపించలేదు. దాంతో విద్యార్థి నాయకులు సెక్యూరిటీని తోసుకొని లోనికి వెళ్లారు. దాంతో భద్రతా సిబ్బందికి, విద్యార్థల నడమ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం స్టూడెంట్స్ ధర్నా చేపట్టారు. బ్లాక్ దందా నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు సమాచారం.