Virat Kohli : జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం
భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
Virat Kohli Wax Statue : టీం ఇండియాలో ప్రముఖ బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ(VIRAT KOHLI) మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో( Jaipur wax museum) ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గురువారం కోహ్లీ విగ్రహాన్ని అక్కడి నహర్‌ఘర్ వ్యాక్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. మ్యూజియం వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనూప్… విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విషయమై మాట్లాడారు.
మ్యూజియంలో ఏర్పాటు చేసిన విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం(VIRAT KOHLI WAX STATUE) 35 కేజీల బరువు ఉంటుందని చెప్పారు. శుక్రవారం నుంచి సందర్శకులు దీన్ని చూసేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. టీం ఇండియా జర్సీతో బ్యాట్ పట్టుకుని ఉన్న విరాట్ విగ్రహం ఎంతో ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. గత కొంత కాలంలో మ్యూజియంకి వస్తున్న పిల్లలు, పెద్దలు కూడా కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. దీంతో తాము ఆయన విగ్రహాన్ని తయారు చేయించామని చెప్పారు.
ఇప్పటికే దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సచిన్ తెందుల్కర్, ధోనీలతోపాటు విరాట్ కోహ్లీ మైనపు విగ్రహమూ(VIRAT KOHLI) ఉంది. దీనితో పాటు ఇప్పుడు జైపూర్‌లోనూ కోహ్లీ వ్యాక్స్ స్టాట్యూ సందర్శకుల కోసం ఆవిషృతమైంది. దీంతో అక్కడికి వస్తున్న సందర్శకులు కోహ్లీ విగ్రహంతో ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.