»Worlds Smallest Living Woman Jyoti Amge Cast Her Vote In Nagpur
Jyoti Amge : ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అతి పొట్టి మహిళ
ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డుకెక్కిన జ్యోతీ ఆమ్గే ఇవాళ జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Jyoti Amge : దేశ వ్యాప్తంగా తొలి విడుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఓటు హక్కుల్ని వినియోగించుకుంటున్నారు. ఆ విషయాలను తమ సామాజిక ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ప్రజలకు ఓ విధంగా ఓటు హక్కుపై అవగాహన కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డులకెక్కిన జ్యోతీ ఆమ్గే(Jyoti Amge) సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి(Nagpur) చెందిన జ్యోతీ ఆమ్గే అక్కడే ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతీ అందరిలానే క్యూలో నిలబడ్డారు. తన వంతు వచ్చిన తర్వాత ఓటు(Vote) వేశారు. తర్వాత అక్కడున్న మీడియాతో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఓటు వేయడం పౌరుల బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు. అంతా తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తాను చదువుకున్న స్కూల్లోనే తాను ఓటు వేసినట్లు చెప్పారు జ్యోతీ ఆమ్గే(Jyoti Amge). తనకులానే తన కుటుంబ సభ్యులు అంతా పోలింగ్ కేంద్రానికి వచ్చారని అంతా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.