»Uppal Stadium Hca Management Is Very Bad Spectators Seats With Bird Droppings
Uppal stadium: నిర్వహణ దారుణం..పక్షుల రెట్టలతో ప్రేక్షకుల సీట్లు
ప్రపంచ కప్‌కు ముందే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దారుణమైన నిర్వహణ తీరు బట్టబయలైంది. ప్రేక్షకుల సీట్లపై అనేక చోట్ల పక్షుల రెట్టలు అలాగే ఉన్న ఓ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై కామెంట్లు చేస్తున్నారు. ఇందులో అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
Uppal stadium HCA management is very bad spectators seats with bird droppings
నేటి(అక్టోబర్ 5) నుంచి ICC ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదలు కానుంది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19, ఆదివారం జరుగుతుంది. దేశంలోని 10 మైదానాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఉత్తరాన ధర్మశాల నుంచి దక్షిణాన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ గేమ్స్ జరగనున్నాయి.
This video is for those doubting thomoses who felt my earlier pics were edited. pic.twitter.com/xmC5ti9hCm
అయితే తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దారుణమైన నిర్వహణ గురించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ODI ప్రపంచ కప్ 2023కి ముందే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రేక్షకుల సీట్లు పక్షుల రెట్టలతో నిండి ఉన్నాయి. ఇది పాకిస్తాన్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా కనిపించిన దృశ్యం. క్రికెట్ రచయిత, విశ్లేషకులు, వ్యాఖ్యాత అయిన సి వెంకటేష్ ఈ ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో పెద్దగా మార్పు ఏమీ లేదని పేర్కొన్నారు.
This is for those, who said I had posted an old or fake pic. I’m very present at the ground. pic.twitter.com/klMfNCM6VM
ఇది చూసిన ఓ వ్యక్తి ప్రపంచ కప్‌కు ముందు అన్ని కుర్చీలను క్లీన్ చేయడానికి HCAకి తగినంత సమయం లేదని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. మరొక వ్యక్తి అయితే 100 కోట్ల రూపాయలకుపైగా వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అధికార ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి నిర్వహణ తీరుపై కళ్లు తెరవాలని నెటిజన్లు అంటున్నారు. ఇది నిజంగా అవమానకరమని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకోవ్యక్తి ఇక్కడ అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇటువంటి విషయాలపై BCCI ఆడిట్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ICC ODI ప్రపంచ కప్ 2023కి ముందు జరిగిన పది వార్మప్ మ్యాచ్‌లలో రెండింటికి హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం 39,200 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది.