»Tripathi Who Washed Away The Punjab Kings Hyderabad Boni
Uppal Stadium : పంజాబ్ కింగ్స్ ను ఉతికారేసిన త్రిపాఠి… హైదరాబాద్ బోణీ
ఐపీఎల్-16 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది.
ఐపీఎల్-16 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(Shikhar Dhawan) (99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు.
సామ్ కరన్ (22) ఫర్వాలేదనిపించగా.. మిగతా ప్లేయర్లందరూ పేలవ ప్రదర్శన చేశారు. బౌలింగ్ విషయానికొస్తే.. మయాంక్ మార్కండే(Mayank Markande) చెలరేగి.. 4 వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ (Bhubaneswar) ఒక వికెట్ పడగొట్టాడు.వన్ డౌన్ లో వచ్చిన త్రిపాఠి పంజాబ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా… బంతి కనిపిస్తే చాలు బాదేశాడు. త్రిపాఠి 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 74 పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ మార్ క్రమ్ కూడా జత కలిశాడు. ఈ జోడీ మరో వికెట్ పడకుండా జట్టును గెలుపుతీరాలకు చేర్చింది. మార్ క్రమ్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.144 పరుగుల లక్ష్యఛేదనను సన్ రైజర్స్ జట్టు 17.1 ఓవర్లలో ముగించింది. ఈ క్రమంలో కేవలం 2 వికెట్లు కోల్పోయింది.