TS Govt:తూచ్.. 24 గంటలు వైన్స్ ఓపెన్ ఉండవు.. జీవోఎంఎస్-4 వాటికే వర్తింపు
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.
TS Govt:ఇటీవల జీవోఎంస్-4ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో షాపులు అన్నీ 24 గంటల పాటు తెరచి ఉంటాయని సారాంశం. వైన్స్ (Wines) , బార్లు (bars) ఓపెన్ చేసి ఉంటాయని సోషల్ మీడియా (socila media) కోడై కూసింది. దీంతో ప్రభుత్వం తిరిగి స్పందించాల్సి వచ్చింది. ఆ జీవో వైన్స్, బార్లకు వర్తించదని తేల్చిచెప్పింది. మిగతా షాపులకేనని స్పష్టంచేసింది.
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో.. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరపడింది. వైన్ షాపులు ఎప్పటిలాగే ఓపెన్ చేసి.. క్లోజ్ చేస్తారు.
హైదరాబాద్ (hyderabad) సిటీలో వైన్స్ రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. జిల్లా కేంద్రాలు/ ఇతర పట్టణాల్లో మాత్రం రాత్రి 10 గంటలకు క్లోజ్ చేస్తారు. వైన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. రెండేళ్లకోసారి వైన్ షాపులకు టెండర్లు వేస్తుంటారు. ఆ టెండర్ల ద్వారా కూడా భారీగా ఇన్ కం వస్తోంది. ఒక్కో షాపుకు టెండర్ వేసే వ్యాపారి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటారు. అలా ఒక్కో షాపుకు చాలా మంది పోటీ పడతారు. అయితే వారంతా సిండికేట్గా ఏర్పడతారని గుసగుసలు వినిపిస్తాయి. ఆ డబ్బులు నాన్ రీఫండబుల్.. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. కేసీఆర్ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించి.. అమలు చేస్తోంది.