AP: రాష్ట్రానికి రానున్న రోజుల్లో తీవ్ర వడగాలుల ముప్పు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ 17 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, పోలవరం, తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఉదయం 10 గంటల నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.